Bajrang Dal: హిందూ-ముస్లిం జంట వివాహాన్ని అడ్డుకున్న భజరంగ్ దళ్.. కోర్టు ఆవరణలోకి ప్రవేశించి వీరంగం

  • ఆ వివాహం లవ్-జిహాద్‌లో భాగమేనన్న భజరంగ్ దళ్
  • ముస్లిం యువకుడిపై దాడికి యత్నం

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కోర్టులో భజరంగ్‌దళ్ కార్యకర్తలు వీరంగం సృష్టించారు. హిందూ యువతి, ముస్లిం యువకుడు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు కోర్టుకు రాగా, తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డుకుని నానా హంగామా చేశారు.

19 ఏళ్ల ముస్లిం కుర్రాడు గ్రేటర్ నోయిడాకు చెందిన 19 ఏళ్ల షామిలిని వివాహం చేసుకున్నాడు. వారు తమ వివాహాన్ని రిజిస్టర్ చేసుకునేందుకు కోర్టుకు వచ్చారు. విషయం తెలుసుకున్న భజరంగ్ దళ్ కార్యకర్తలు కోర్టుకు వచ్చి యువకుడిపై దాడికి యత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు జంటకు రక్షణ కల్పించారు. వారిని వెంటనే పోలీసు వాహనంలోకి తరలించారు. కాగా, యువతి తల్లిదండ్రులు ఇప్పటికే యువకుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

మరోవైపు ఈ వివాహం ‘లవ్ జిహాద్’ కిందకు వస్తుందని భజరంగ్ దళ్ పశ్చిమ యూపీ కన్వీనర్ బల్రాజ్ దుంగార్ తెలిపారు. తమకు అందిన సమాచారం ప్రకారం ఇది బలవంతపు వివాహమని పేర్కొన్నారు. తమకొచ్చిన సమాచారం నిజమేనని తేలిందన్నారు. అందుకనే ఈ వివాహ రిజిస్ట్రేషన్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు ఆయన వివరించారు.

  • Loading...

More Telugu News