atal bihari vajpayee: ఓటర్ లిస్ట్ నుంచి మాజీ ప్రధాని వాజ్ పేయి పేరు తొలగింపు

  • లక్నోలో వాజ్ పేయికి ఓటు
  • 2000లో చివరిసారిగా ఓటు వినియోగించుకున్నారు
  • ప్రస్తుతం బెడ్ కే పరిమితమైన వాజ్ పేయి
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి పేరును ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. ఈ విషయాన్ని యూపీ రాజధాని లక్నో పురపాలక సంఘం ఒకటో జోన్ జోనల్ అధికారి అశోక్ కుమార్ తెలిపారు. బనారసీ దాస్ లోని 92/98-1 నంబరు ఇంటిలో ఆయన ఓటరుగా నమోదయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన పురపాలక సంఘం ఎన్నికల్లో ఆయన చివరిసారిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఓటు వేయలేదు. పదేళ్ల నుంచి ఆయన లక్నోకి రావడం లేదు. ఆయన వయసు 92 ఏళ్లు. ప్రస్తుతం వాజ్ పేయి ఎవరినీ గుర్తించలేని స్థితిలో, బెడ్ కే పరిమితమైన సంగతి తెలిసిందే. 
atal bihari vajpayee
lucknow
vajpayee vote

More Telugu News