shobu yarlagadda: ఇలాగేనా రాసేది?: రివ్యూలపై మండిపడ్డ నిర్మాత శోభు యార్లగడ్డ

  • సినిమాల రివ్యూలపై కొనసాగుతోన్న వివాదం
  • సినిమాను స‌గ‌మే చూస్తూ, సెల్‌ఫోన్‌లో ఏదో టైప్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టేస్తున్నారు
  • దానికి రివ్యూ అని పేరు పెడుతున్నారు

సినిమాలపై ఇష్టం వచ్చినట్టు రివ్యూలు రాస్తూ వాటికి నష్టం వచ్చేలా చేస్తున్నారని టాలీవుడ్ సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు ఇటీవల మండిపడుతోన్న విషయం తెలిసిందే. నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ కూడా ఈ అంశంపై స్పందించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

‘స్పైడ‌ర్’ సినిమాపై ఓ వెబ్‌సైట్ ఇచ్చిన రివ్యూను త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ సినిమాను స‌గ‌మే చూస్తూ, సెల్‌ఫోన్‌లో ఏదో టైప్ చేసి వెబ్‌సైట్‌లో పెట్టేసి దాన్ని రివ్యూ అనేస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌తి సినిమాను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించి రివ్యూ రాయాల‌ని ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. సినిమాల‌ను ఎంతో క‌ష్ట‌ప‌డి తీస్తార‌ని, వాటిపై ఎలా ప‌డితే అలా రివ్యూలు రాయ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు.

More Telugu News