Hugh Hefner: ప్రపంచానికి 'ప్లేబాయ్'ని పరిచయం చేసిన హగ్ హెఫ్నర్ కన్నుమూత

  • 91 ఏళ్ల వయసులో సహజ మరణం పొందిన హెఫ్నర్
  • ఐదేళ్ల క్రితమే 26 ఏళ్ల క్రిస్టల్ ను వివాహం చేసుకున్న హారిస్
  • 60వ దశకంలో లైంగిక విప్లవానికి కారణమైన 'ప్లేబాయ్'

అడల్డ్ మేగజైన్ 'ప్లేబాయ్'ని ప్రపంచానికి పరిచయం చేసిన హెగ్ హెఫ్నర్, తన 91 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన వయసు మీదపడడంతో సహజ మరణం పొందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. టైమ్స్ మేగజైన్ ఒకప్పుడు ఆయన్ను 'సుఖ ప్రవక్త'గానూ అభివర్ణించింది. స్వేచ్ఛా జీవనయానం లక్ష్యంగా ఆయన మొదలు పెట్టిన 'ప్లేబాయ్' పత్రిక 1960వ దశకంలో ప్రపంచవ్యాప్తంగా లైంగిక విప్లవానికి కారణమైందన్న సంగతి తెలిసిందే.

 'ప్లేబాయ్' మేగజైన్ కోసం దాని విడుదలకు రోజుల ముందే పుస్తకాల దుకాణాల వద్ద క్యూలైన్లు కనిపించేవి. ఆయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నట్టు ప్లేబాయ్ ఎంటర్ ప్రైజస్ పేర్కొంది. కాగా, 80 ఏళ్ల వయసులోనూ తనలోని పటుత్వాన్ని వయాగ్రాలు కాపాడుతూ వచ్చాయని ఆయన తన 82 ఏళ్ల వయసులో సీఎన్ఎన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తన 86 ఏళ్ల వయసులో తనకన్నా 60 ఏళ్లు చిన్నదైన క్రిస్టల్ హారిస్ ను మూడో భార్యగా వివాహం చేసుకుని, ఆమెతోనూ లైంగిక సుఖాన్ని తాను అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు.

More Telugu News