cigarettes: సిగరెట్లను విడిగా విక్రయించకూడదు.. కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు

  • సిగరెట్లను విడిగా అమ్మడంపై నిషేధం
  • బహిరంగ ధూమపానాన్ని అరికట్టడమే లక్ష్యం
  • విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు

సిగరెట్లతో పాటు వివిధ రకాల పొగాకు ఉత్పత్తులపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సిగరెట్లు, బీడీలు, పొగాకు ఉత్పత్తులను విడిగా విక్రయించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ధూమపానాన్ని నిషేధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. విడిగా సిగరెట్లను విక్రయిస్తుండటమే బహిరంగ ధూమపానానికి కారణమని ఓ అధ్యయనంలో తేలింది.

 ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పొగాకు నమలడంపై కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుత ఆదేశాల ప్రకారం... సిగరెట్లను పెట్టెగానే విక్రయించాలి. విడిగా అమ్మడం కుదరదు. విడిగా విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.

More Telugu News