mehbooba: ఇండో - పాక్ యుద్ధం నేపథ్యంలో 'మెహబూబా'... చెప్పేసిన పూరీ జగన్నాథ్

  • స్క్రిప్టు పని పూర్తయింది
  • అక్టోబర్ నుంచి షూటింగ్
  • సంగీతం సందీప్ చౌటా 
  • వెల్లడించిన పూరీ జగన్నాథ్
తన కుమారుడు ఆకాశ్ హీరోగా తాను తలపెట్టిన 'మెహబూబా' స్క్రిప్టు పని పూర్తయిందని దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించారు. గతంలో తాను తీసిన చిత్రాలకన్నా ఇది భిన్నంగా ఉంటుందని, తన ఆలోచనల పరిధిని దాటి ఉంటుందని అన్నాడు. 1971 నాటి ఇండియా పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో కథ సాగుతుందని చెప్పాడు.

మంగళూరుకు చెందిన నేహా శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నామని అన్నాడు. చిత్రానికి సందీప్ చౌటా మ్యూజిక్ అందించనున్నట్టు తెలిపాడు. అక్టోబర్ లో చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని, హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమయ్యే చిత్రీకరణ ఆపై పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ సాగుతుందని చెప్పాడు. తాను యుద్ధ వాతావరణం మధ్య సాగే లవ్ స్టోరీని తొలిసారిగా తీస్తున్నానని అన్నాడు.
mehbooba
puri jaganath
aakash puri
neha shetty

More Telugu News