twitter: ట్వీట్ రాసే అవ‌ధిని పెంచిన ట్విట్ట‌ర్‌.... 140 నుంచి 280 అక్ష‌రాల‌కు పెంపు

  • ప్ర‌యోగంలో ఉన్న కొత్త మార్పు
  • త్వ‌ర‌లో పూర్తిస్థాయిలో అమ‌ల్లోకి
  • మంచి ప‌రిణామం అంటున్న వినియోగ‌దారులు


ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్‌లో భావాల‌ను వ్య‌క్తం చేయాలంటే కేవ‌లం 140 అక్ష‌రాల్లోనే చెప్పాల్సివ‌చ్చేది. అంత‌కంటే ఎక్కువ అక్ష‌రాల్లో చెప్పాలంటే రెండు లేదా మూడు ట్వీట్లు చేయాల్సి వ‌చ్చేది లేదంటే ఏదైనా థ‌ర్డ్ పార్టీ వెబ్‌సైట్ స‌హాయం తీసుకోవాల్సి వ‌చ్చేది. ఇక ఆ అవ‌స‌రం లేదు. ట్వీట్ రాసే అవ‌ధిని రెట్టింపు చేస్తూ 280 అక్ష‌రాలు రాసే వీలు క‌ల్పించింది.

 ప్ర‌స్తుతం ప్ర‌యోగ‌ద‌శ‌లో ఉన్న స‌దుపాయాన్ని త్వ‌ర‌లోనే పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పును ట్విట్ట‌ర్ వినియోగ‌దారులు స్వాగ‌తిస్తున్నారు. సెల‌బ్రిటీలు, ప్ర‌ముఖులు స‌మాజంలోని వివిధ అంశాలపై త‌మ భావాల‌ను, అభిప్రాయాల‌ను వ్యక్త‌ప‌ర‌చ‌డానికి ట్విట్ట‌ర్‌ను వేదిక‌గా చేసుకుంటారు. ఇక నుంచి వారంద‌రికీ త‌మ అభిప్రాయాల‌ను ఎక్కువ మాట‌ల్లో చెప్పే అవ‌కాశం క‌ల‌గ‌నుంది.

More Telugu News