Uganda: రణరంగంగా మారిన ఉగాండా పార్లమెంటు.. దాడులు చేసుకున్న ఎంపీలు!

  • ఉగాండా పార్లమెంటులో ఘర్షణ
  • అధ్యక్ష ఎన్నికల్లో వయోపరిమితి సడలింపు బిల్లు ప్రవేశపెట్టిన అధికార పక్షం
  • ఆ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు
  • తీవ్ర వాగ్వాదం, ఘర్షణ.. 8 మంది ఎంపీలకు గాయాలు

ఉగాండా పార్లమెంటు రణరంగంగా మారింది. ఉగాండా అధ్యక్ష ఎన్నికల్లో వయోపరిమితిని పెంచుతూ అధికార పక్షం ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టింది. అదే సమయంలో ప్రతిపక్ష ఎంపీ ఒకరు పార్లమెంటులోకి తుపాకి తీసుకొచ్చారన్న సమాచారం అందింది. దీంతో ఎంపీలను తనిఖీ చేయాలని సభాపతి ఆదేశించారు. ఇది మరింత ఆందోళనకు దారితీసింది. తనిఖీల్లో తుపాకి లభ్యం కాకపోవడంతో అధికార పక్షం కుట్రకు పాల్పడిందంటూ విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి దీటుగా అధికారపక్షం ఎంపీలు స్పందించారు. దీంతో రెండు వర్గాల మధ్య తీవ్రవాగ్వాదం, ఘర్షణ చోటుసుకున్నాయి.

ఇందులో 8 మంది ఎంపీలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి, సభను వాయిదావేశారు. అయినా విపక్ష ఎంపీలు పార్లమెంటు బయట ఆందోళన కొనసాగించారు. కాగా, 1996 నుంచి ఉగాండా అధ్యక్షుడిగా మూసెవేని కొనసాగుతున్నారు. 2021 ఎన్నికల తరువాత ఆయన పదవి నుంచి వైదొలగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వయోపరిమితి బిల్లు తీసుకొస్తే తన పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన మూసెవేని తమ ఎంపీలతో వయోపరిమితి సడలింపు బిల్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీనిని విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు.

More Telugu News