Hyderabad: హైదరాబాదులో పొద్దున్నే వర్షం.. ప్రజల ఇక్కట్లు!

  • హైదరాబాదును ముంచెత్తిన వాన
  • అకస్మాత్తుగా కురుస్తున్న వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
  • మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
నేటి తెల్లవారు జాము నుంచి హైదరాబాదులోని పలు ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. కూకట్ పల్లి, మూసాపేట్, ఎస్ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వర్షంతో కార్యాలయాలకు వెళ్లాల్సిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

వర్షం కారణంగా రోడ్లపైకి నీరు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాగా, మల్కాజిగిరి, రంగారెడ్డి, హైదరాబాదు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. 
Hyderabad
raining
varsham
problems

More Telugu News