dawood ibrahim: దావూద్ ఇబ్రహీంకు షాక్.. సోదరుడిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

  • దోపిడీ, అక్రమ ఆస్తి లావాదేవీలపై కేసు నమోదు
  • కస్కర్ తో పాటు మరో ఇద్దరిపై కేసు
  • ఇటీవలే వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • విచారణలో పలు విషయాలను వెల్లడించిన కస్కర్

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు భారత్ షాక్ ఇచ్చింది. అతని సోదరుడు ఇక్బాల్ కస్కర్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. కస్కర్ తో పాటు ఆయన అనుచరులు ఇస్రార్ జెడ్ సయ్యద్, ముంతాజ్ ఏ షేక్ లపై అక్రమ ఆస్తి లావాదేవీలు, దోపిడీ తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసింది. ఈడీ తెలిపిన వివరాల ప్రకారం... వీరంతా 2013 నుంచి దావూద్ ఇబ్రహీం పేరు చెప్పుకుంటూ థానేకు చెందిన ప్రముఖ బిల్డర్ కు చెందిన 4 ఫ్లాట్లను, రూ. 30 లక్షల నగదును దోపిడీ చేశారు. ఇదే అంశంపై ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది.

వీరందరినీ ఇటీవలే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా పాకిస్థాన్ లోనే దావూద్ ఉన్నాడని, కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడటం లేదని, భారత్ రావాలనుకుంటున్నాడనే విషయాలను కస్కర్ వెల్లడించాడు. 

More Telugu News