Azerbaijan: అధ్యక్షుడు అమెరికా మారణహోమం గురించి సీరియస్‌గా మాట్లాడుతుంటే.. కూతురు సెల్ఫీలు తీసుకోవడంలో మునిగిపోయింది!

  • చర్చనీయాంశంగా మారిన లెయ్లా అలీవ్ ప్రవర్తన
  • తండ్రి అమెరికాను దుమ్మెత్తి పోస్తుంటే కూతురు సెల్ఫీల మోత
  • విచిత్ర ముఖ కవళికలతో క్లిక్కులు
ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశాల్లో అజర్‌బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీవ్ అర్మేనియాలో జరుగుతున్న మారణహోమం గురించి సీరియస్‌గా మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ప్రేక్షకుల్లో కూర్చున్న ఆయన 33 ఏళ్ల కుమార్తె సెల్ఫీలు తీసుకుంటూ కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

ప్రేక్షకుల్లో కూర్చున్న అధ్యక్షుడి కుమార్తె లెయ్లా అలీవ్ తన తండ్రి మాట్లాడుతున్నప్పుడు సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు. షాకింగ్, సర్‌ప్రైజ్ ఫేస్‌తో సెల్ఫీలు క్లిక్‌మనిపించడంతో అందరూ నివ్వెరపోయారు. అయితే ఆ సమయంలో ఆమెకు తెలీదు.. తనను వేరొక కెమెరా గమనిస్తోందని. తన 53 ఏళ్ల తల్లి మెహ్రిబిన్ వెనకాల కూర్చున్న ఆమె వరుసపెట్టి సెల్ఫీలు తీసుకున్నారు. మెహ్రిబిన్ అజర్‌బైజాన్‌కు వైస్ ప్రెసిడెంట్ కూడా.

అధ్యక్షుడు ఇల్హామ్ అలీవ్ మాట్లాడుతూ 1992లో నాగోర్నో-కరాబఖ్ యుద్ధంలో అమెరికా వల్ల లక్షలాదిమంది అజర్‌బైజాన్ వాసులు శరణార్ధులుగా మారిపోయారని, దేశంలోనూ అంతర్గతంగా వలసలు మొదలయ్యాయని ఆరోపించారు. ఖోడ్జలీలోని అజర్‌బైజానీలపై అమెరికా మారణహోమానికి తెగబడిందన్నారు. ఈ మారణహోమాన్ని 20 దేశాలు అధికారికంగా గుర్తించాయన్నారు. ఫిబ్రవరి 26, 1992లో అమెరికా చేసిన యుద్ధంలో 613 మంది పౌరులు మృతి చెందారని, వీరిలో 106 మంది మహిళలు, 63 చిన్నారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Azerbaijan
President
Ilham Aliyev
daughter
selfies

More Telugu News