barak obama: కూతురిని హార్వార్డ్ యూనివర్సిటీకి పంపి తీవ్ర భావోద్వేగానికి గురైన ఒబామా

  • కుమార్తెను హార్వార్డ్ యూనివర్సిటీలో జాయిన్ చేసిన ఒబామా
  • తిరిగి వస్తున్న సమయంలో ఆందోళనకు గురయ్యానన్న మాజీ అధ్యక్షుడు 
  • ఆ సమయంలో తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్టు అనిపించిందట 
తన కుమార్తెను హార్వార్డ్ యూనివర్సిటీకి పంపిన సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బ్యూ బిడెన్ ఫౌండేషన్‌ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, తన పెద్ద కుమార్తె మలియాను ఈ మధ్యే ఉన్నత విద్య కోసం హార్వార్డ్ యూనివర్సిటీకి పంపానని తెలిపారు. యూనివర్సిటీలో చేర్పించి తిరిగి వచ్చే సమయంలో తనకు ఆమె బై చెబుతుంటే తీవ్రమైన ఆందోళన కలిగిందని, అప్పుడు తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తున్నట్టు అనిపించిందని ఆయన చెప్పారు.


barak obama
malia
sasha
horward university

More Telugu News