north korea: అమెరికా విమానాలను ఉత్తర కొరియా చూసుంటే... ఏం జరిగి ఉండేదో ఊహించలేమన్న దక్షిణ కొరియా

  • గత వారం చివర్లో బాంబర్లను పంపిన అమెరికా
  • కనిపెట్టలేక పోయిన ఉత్తర కొరియా
  • చూసుంటే దాడి చేసేవారన్న దక్షిణ కొరియా

గత వారాంతంలో అమెరికా తన యుద్ధ విమానాలను కొరియా సరిహద్దుల్లోని తూర్పు తీరానికి పంపిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్యసమితి వేదికపై ఉత్తర కొరియా ప్రతినిధి మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. దీనిపై తాజాగా దక్షిణ కొరియా ఓ ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ దేశానికి దగ్గరగా వచ్చి, తీరంపై ఎగురుతున్న యుద్ధ విమానాలను ఉత్తర కొరియా గుర్తించలేకపోయిందని, ఆ దేశపు నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని దక్షిణ కొరియా వార్తా సంస్థలు పేర్కొన్నాయి.

ఒకవేళ ఈ యుద్ధ విమానాలను ఉత్తర కొరియా గమనించి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించలేక పోతున్నామని పేర్కొన్నాయి. ఆ విమానాలను కొరియా సైన్యం, నిఘా వ్యవస్థ గమనించి ఉంటే కచ్చితంగా దాడి చేసి ఉండేవారని అంచనా వేశాయి. కిమ్ జాంగ్ నిఘా వ్యవస్థ బలం ఎంతన్నది ఈ సంఘటనతోనే ప్రపంచానికి తెలిసిందని ఎద్దేవా చేశాయి.

కాగా, దక్షిణ కొరియా చేసిన వ్యాఖ్యలను ఉత్తర కొరియా ఖండించింది. విమానాలు తమ తీరం వైపుగా వచ్చిన సంగతి తమకు తెలుసునని, కొరియా ప్రాదేశిక జలాల్లోకి అవి రాలేదని, వస్తే తమ సత్తా చూపుండేవాళ్లమని ఆ దేశ విదేశాంగ మంత్రి వ్యాఖ్యానించారు.

More Telugu News