Rail: ఒకే ట్రాక్‌పైకి మూడు రైళ్లు.. క్షణాల్లో తప్పిన పెను ముప్పు!

  • అలహాబాద్‌ సమీపంలో ఘటన
  • సకాలంలో గుర్తించడంతో తప్పిన ప్రమాదం
  • గత రెండు నెలల్లో పలు ప్రమాదాలు 

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైల్వే ప్రమాదం క్షణంలో తప్పింది. అధికారులు ప్రమాదాన్ని సకాలంలో గుర్తించకుంటే  పెను విషాదం జరిగి ఉండేది. అలహాబాద్ సమీపంలో ఒకే ట్రాక్‌లో మూడు రైళ్లు వేగంగా పరుగులు పెడుతున్నాయి. మూడు రైళ్లు ఒకదానికొకటి చేరువ అవుతున్నప్పుడు గుర్తించిన అధికారులు వెంటనే అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించగలిగారు. దురంతో, హతియా-ఆనంద్ విహార్, మహాబోధి ఎక్స్‌ప్రెస్‌లు ఒకే ట్రాక్‌పై ప్రయాణిస్తున్నట్టు తెలుసుకున్న అధికారుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. అయితే వెంటనే స్పదించి రైళ్ల ట్రాక్ మార్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా, గత రెండు నెలల్లో దేశంలో ఎన్నడూ లేనన్ని రైలు ప్రమాదాలు జరిగాయి. ఈనెల 7న ఒకేరోజున 12 గంటల వ్యవధిలో మూడు రైళ్లు పట్టాలు తప్పడం కలకలం రేపింది. యూపీలో శక్తిపుంజ్, ఢిల్లీలో రాజధాని ఎక్స్‌ప్రెస్, మహారాష్ట్రలో గూడ్సు రైలు పట్టాలు తప్పాయి. ఆగస్టు 23న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనలో వందమందికిపైగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News