mahesh: కెరీర్‌లో ఇంతవరకు నాకు ఇంత పెద్ద ప్రాజెక్టు రాలేదు!: 'స్పైడర్' గురించి మహేశ్ బాబు

  • రెండు మార్కెట్ల‌ను ఎలా బ్యాలెన్స్ చేయాల‌న్న విష‌యంపై మురుగ‌దాస్ క‌ష్ట‌ప‌డ్డారు
  • సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డా
  • ఓ మంచి సినిమా తీశామ‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాం 
  • ఆడియెన్స్ బాగా థ్రిల్‌ ఫీల్ అవుతారు

మ‌హేశ్ బాబు ‘స్పైడ‌ర్’ సినిమా రేపు విడుదలవుతోన్న నేప‌థ్యంలో ఈ రోజు హైద‌రాబాద్ లో ఆ సినిమా బృందం మీడియా సమావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా మ‌హేశ్ బాబు మాట్లాడిన త‌రువాత ర‌కుల్ ప్రీత్‌సింగ్ మాట్లాడాల‌ని విలేక‌రులు అడిగారు. దానికి మ‌హేశ్ బాబు స్పందిస్తూ ‘ర‌కుల్ ఇక్క‌డే ఉంది.. మీరు కంగారు ప‌డ‌కండి’ అన్నారు. ఆమె ఎక్క‌డికీ పోద‌ని, ముందుగా ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్‌ మాట్లాడుతారని అన్నారు.

అంత‌కు ముందు మ‌హేశ్ బాబు మాట్లాడుతూ... రెండు మార్కెట్ల‌ను ఎలా బ్యాలెన్స్ చేయాల‌న్న విష‌యంపై మురుగ‌దాస్ క‌ష్ట‌ప‌డ్డారని చెప్పారు. కెరీర్‌లో తనకు ఇంత పెద్ద ప్రాజెక్టు రాలేదని, సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాన‌ని చెప్పారు. భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నాం కాబ‌ట్టి, రెండు భాష‌ల్లో చేయాల‌ని అనుకున్నామ‌ని చెప్పారు. ఓ మంచి సినిమా తీశామ‌న్న న‌మ్మ‌కంతో ఉన్నామ‌ని చెప్పారు.

రేపు ప్రేక్ష‌కులు ఎలా ఆద‌రిస్తారో చూడాలని మహేశ్ బాబు అన్నారు. ఆడియెన్స్ బాగా థ్రిల్‌ ఫీల్ అవుతారని చెప్పారు. తాను తమిళ సినిమాలో న‌టిస్తానని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. త‌మిళ ప్ర‌జ‌లు ఎలా ఆద‌రిస్తారోన‌న్న ఆత్రుత‌ ఉందని చెప్పారు. త‌మిళ‌నాడులో మురుగ‌దాస్ సినిమాల‌కు ఎంత ఆద‌ర‌ణ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదని అన్నారు. టాలీవుడ్‌లో ఆడ‌ని కొన్ని సినిమాలు కూడా త‌మిళ‌నాడులో పెద్ద హిట్ల‌యిన సంద‌ర్భాలు ఉన్నాయని చెప్పారు. తాను చెన్నైలోనే పుట్టి పెరిగాన‌ని అన్నారు. 

More Telugu News