actress archana: జైలు నుంచి బయటకు వచ్చినట్టుంది: బిగ్ బాస్ కంటెస్టెంట్ అర్చన

* బిగ్ బాస్ ఇంత సక్సెస్ అవుతుందని ఊహించలేదు

* బిగ్ బాస్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అనిపించేది

* ప్రజల రెస్పాన్స్ సంతోషాన్నిస్తోంది

* ప్రజలంతా తమ ఇంట్లో ఒక అమ్మాయిలా నన్ను చూస్తున్నారు

70 రోజులపాటు కొనసాగిన బిగ్ బాస్ కార్యక్రమం ముగియడంతో ఫైనలిస్టులంతా ఎవరి ఇంటికి వారు చేరుకున్నారు. ఈ కార్యక్రమం గురించి ఫైనలిస్ట్ అర్చన సంతోషం వ్యక్తం చేసింది. ఓ చానల్ తో మాట్లాడుతూ తన అనుభూతులను ప్రేక్షకులతో పంచుకుంది.

70 రోజుల తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం... జైలు నుంచి బయటకు వచ్చినట్టుగా ఉందని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లో జైల్లో ఉన్నట్టే అనిపించిందని చెప్పింది. బిగ్ బాస్ ఇంత ఘన విజయాన్ని సాధిస్తుందని తాను భావించలేదని తెలిపింది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేటప్పుడు, ఇన్ని రోజులు షోలో ఉంటానని తాను అసలు ఊహించలేదని అంది.

హైదరాబాద్ కు వచ్చిన తర్వాత... తనకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోందని చెప్పింది. ఇప్పటిదాకా తనను సినీ నటిగానే చూసిన ప్రజలు... ఇప్పుడు వాళ్లింట్లో ఒక అమ్మాయిలా చూస్తున్నారని తెలిపింది.
actress archana
archana
bigboss

More Telugu News