bigboss: దీక్ష వైఖరితో తన మనసు విరిగిపోయిందన్న నటి అర్చన!

  • దీక్షతో ఎన్నో గొడవలు
  • తేలికగానే తీసుకున్నా
  • నన్ను అన్న మాటలతో మనసు విరిగింది
  • ఇక ఆమెతో మాట్లాడేది లేదు: అర్చన
దాదాపు రెండున్నర నెలల పాటు బిగ్ బాస్ హౌస్ లో గడిపి బయటకు వచ్చిన అర్చన, అక్కడ తనకు ఎదురైన అనుభవాలు, తోటి కంటెస్టెంట్ దీక్షతో జరిగిన గొడవపై మనసులోని మాటను పంచుకుంది. ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, హౌస్ లో తనకు, దీక్షకూ మధ్య పిల్లీ, ఎలుకా వంటి గొడవలు జరిగాయని, తాను తేలికగా తీసుకుంటే, దీక్ష సీరియస్ అయ్యేదని, ఒక్కోసారి ఆమె అన్న మాటలతో తన మనసు విరిగిపోయిందని తెలిపింది.

అప్పటికీ సర్దుకునే ఉన్నానని, దీక్ష ఎలిమినేట్ అయిన తరువాత స్టేజీపై తనను ఎన్నో మాటలందని, ఎందుకంత కటువుగా మాట్లాడిందో ఆమెకే తెలియాలని చెప్పింది. పుణె నుంచి అందరమూ కలిసే హైదరాబాద్ కు వచ్చామని, తాను మాత్రం ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని, విరిగిన తన మనసు అతుక్కోబోదని చెప్పింది. తనమీద లెక్కలేనన్ని ఆరోపణలు చేసిన దీక్షతో ఇక మాట్లాడేది లేదని తేల్చి చెప్పింది.
bigboss
archana
deeksha

More Telugu News