rajamouli: రజనీకాంత్ అల్లుడితో రాజమౌళి నెక్స్ట్ మూవీ?

  • రాజమౌళి నెక్స్ట్ మూవీపై అందరిలోను ఆసక్తి
  •  కథను బట్టి హీరోను ఎంచుకునే రాజమౌళి
  •  అయన నెక్స్ట్ మూవీ ధనుష్ తో అంటూ టాక్
  •  తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో

'బాహుబలి 2' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రాజమౌళి, తన తదుపరి సినిమా పనుల్లో బిజీగా వున్నారు. అయితే ఏ హీరోతో ఆయన తన తదుపరి సినిమాను తెరకెక్కించనున్నాడు? అనే విషయం మాత్రం బయటికి రాలేదు. భవిష్యత్తులో మాత్రం ఆయన చరణ్ .. ఎన్టీఆర్ .. మహేశ్ బాబులతో సినిమాలు చేయనున్నట్టు వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఎవరితో చేయనున్నాడనేదే ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లోనే కాదు కోలీవుడ్ లోను షికారు చేస్తోంది. ధనుష్ తో రాజమౌళి చేయనున్న సినిమా, తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కనుందని అంటున్నారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించే ఈ కథకి నాయికను ఎంపిక చేయనున్నారు. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.  

More Telugu News