`సంఘ‌మిత్ర‌` సినిమాలో దిశా ప‌టానీ?

26-09-2017 Tue 12:47
రూ. 150 కోట్ల బ‌డ్జెట్‌తో తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సుంద‌ర్ సి తెర‌కెక్కించ‌నున్న `సంఘ‌మిత్ర‌` చిత్రంలో ప్ర‌ధాన పాత్ర కోసం `ఎంఎస్ ధోనీ` ఫేం దిశా ప‌టానీ ఎంపికైంది. ఇంత‌కు ముందు ఈ పాత్ర కోసం శ్రుతి హాస‌న్‌ను అనుకున్నారు. కానీ ఒప్పందం ప్ర‌కారం పూర్తి స్క్రిప్ట్‌ను ఆమెకు వివ‌రించ‌ని కార‌ణంగా శ్రుతి ఈ సినిమా నుంచి వైదొల‌గింది.

2017 ప్రారంభంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ల‌ను విడుద‌ల చేశారు. కానీ ఆక‌స్మికంగా శ్రుతి హాస‌న్ త‌ప్పుకోవ‌డంతో ప్రాజెక్టు ప‌క్క‌న ప‌డింది. అయితే ఈ ప్రాజెక్టు ఆగిపోయింద‌ని వార్త‌లు వ‌స్తుండ‌టంతో సుంద‌ర్ భార్య న‌టి ఖుష్బు ప్రాజెక్టు డిసెంబ‌ర్ నుంచి ప్రారంభ‌మ‌వుతుంద‌ని స్ప‌ష్ట‌తనిచ్చారు.