japan: పార్లమెంట్ ను రద్దు చేస్తున్నా: జపాన్ ప్రధాని షింజో అబే సంచలన ప్రకటన

  • అక్టోబరులోనే ముందస్తు ఎన్నికలు
  • కొరియాను ఎదుర్కొంటాం
  • తదుపరి ప్రభుత్వం కూడా తనదేనన్న అబే

ముందుగా ప్రకటించినట్టుగానే జపాన్ ప్రధాని షింజో అబే పార్లమెంటును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబరులో దేశంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. గడచిన ఐదేళ్లుగా ప్రధానమంత్రి పదవిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న షింజో అబే, ఈ ఉదయం ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలను దీటుగా ఎదుర్కొంటామని, తదుపరి ప్రభుత్వాన్ని తానే ఏర్పాటు చేస్తానని, ఆపై రక్షణ రంగానికి నిధులు పెంచుతామని చెప్పారు.

విద్యాభివృద్ధికి 17 బిలియన్‌ డాలర్లకు పైగా కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఉత్తర కొరియా అణు పరీక్షలను ఆపితే, ఆర్థికసాయం చేసేందుకు ముందుకొస్తామని చెప్పిన ఆయన, అణు ప్రయోగాలు ఆపకుంటే మాత్రం తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని హెచ్చరించారు. కాగా, టోక్యో గవర్నర్‌ యురికో కోయ్‌ కే, ఇటీవల తాన కొత్త పార్టీ పెట్టనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలోనే, పార్లమెంటును రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని అబే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

More Telugu News