america: అమెరికాను తీవ్రంగా హెచ్చరించిన ఉత్తరకొరియా పార్లమెంటరీ కమిటీ!

  • ట్రంప్ యుద్ధం మొదలు పెట్టారని ఆరోపించిన ఉత్తరకొరియా పార్లమెంటరీ కమిటీ
  • ప్రపంచ దేశాల మద్దతు కోరుతూ ట్రంప్ లేఖలు రాశారన్న ఉ.కొరియా  
  • అమెరికాకు తల వంచం
  • దాడికి దిగితే అమెరికా తమ హైడ్రోజన్ బాంబు దెబ్బ రుచి చూస్తుందని హెచ్చరిక 

'ఉత్తరకొరియాపై యుద్ధం మొదలు పెట్టాం, అన్ని దేశాలు మద్దతు పలకాలి' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని దేశాలకు ఓపెన్ లెటర్ రాశారని ఉత్తరకొరియా పార్లమెంటరీ కమిటీ ఆరోపించింది. ఆదివారమే ఆ లేఖలు ఆయాదేశాల పార్లమెంట్లకు చేరాయని తెలిపింది. ఉత్తరకొరియాపై తీవ్రమైన కక్ష పెంచుకున్న ట్రంప్ ఈ రకమైన వేధింపులకు పాల్పడుతున్నారని ఉత్తరకొరియా ఆరోపించింది.

ఈ మేరకు ప్రపంచ దేశాల పార్లమెంట్లకు ఉత్తరకొరియా లేఖలు రాసింది. ఈ లేఖల్లో...తాజాగా జరిగిన ఐక్యరాజ్యసమితి సెక్యూరిటీ కౌన్సిల్ లో ట్రంప్ మాట్లాడుతూ, ఉత్తరకొరియాను సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశారని గుర్తుచేసింది. దానిని నిజం చేసేందుకు ట్రంప్ నడుంబిగించారని ఆరోపించింది. అయితే తాము అమెరికాకు తలవంచమని ఆ లేఖల్లో స్పష్టం చేసింది. తమపై దాడికి దిగితే అమెరికా తమ హైడ్రోజన్ బాంబు దెబ్బ రుచిచూస్తుందని తీవ్రంగా హెచ్చరించింది. 

More Telugu News