america: వీడియో యుద్ధం: అమెరికా క్షిపణులు, బాంబర్లు, జెట్ విమానాలను ధ్వంసం చేస్తున్నట్టుగా వీడియోను వదిలిన ఉత్తరకొరియా

  • మాటల యుద్ధాన్ని వీడియో యుద్ధంగా మార్చిన ఉత్తరకొరియా
  • తమపై అమెరికా దాడి చేసినట్టు వీడియోను రూపొందించిన ఉత్తరకొరియా
  • ఉత్తరకొరియా అధికారిక మీడియాలో ప్రసారం
  • క్షిపణులు, బాంబర్లు, జెట్ విమానాలతో దాడికి దిగినట్టు చూపిన ఉత్తరకొరియా
  • ట్రంప్ ను ఎద్దేవా చేయడంతో మొదలయ్యే వీడియో
  • ఉత్తరకొరియా హెచ్చరికతో ముగిసిన వీడియో

అమెరికా, ఉత్తరకొరియాల మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పలు మలుపులు తిరుగుతూ వేడెక్కిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త వీడియోను రూపొందించి, దానిని ఉత్తరకొరియా మీడియా ప్రసారం చేసింది. ఈ వీడియోలో అధ్యక్షుడు కిమ్ ను 'రాకెట్ మ్యాన్' అంటూ ట్రంప్ పేర్కొనడాన్ని ఉత్తరకొరియా చూపించింది.

ఆ తరువాత అమెరికా క్షిపణులు, బాంబర్లు, జెట్ విమానాలు ఉత్తరకొరియాపైకి దూసుకెళ్ళడం కనిపిస్తుంది. ఆ వెంటనే వాటన్నింటినీ నార్త్ కొరియా పేల్చేసింది. ఉత్తరకొరియాపై దాడి అనే దుస్సాహసానికి అమెరికా పూనుకుంటే బూడిద కావాల్సిందేనంటూ కిమ్ ప్రభుత్వం ఈ వీడియోలో హెచ్చరించడం కనిపిస్తుంది. దీంతో మాటల యుద్ధం వీడియోల యుద్ధంగా మారినట్టు కనిపిస్తోంది. మరి తరువాతి దశ ఏంటోనన్న ఆసక్తి రేగుతోంది. 

More Telugu News