spider : పైరసీ లింకులు కనిపిస్తే మాకు పంపండి: ‘స్పైడ‌ర్’ టీమ్ విజ్ఞప్తి

  • సినిమా యూనిట్లకు పైరసీ భయం
  • spyderantipiracy@gmail.com కు ‘స్పైడ‌ర్’ పైర‌సీ లింకుల‌ను పంపించండి
  • అభిమానులను కోరుతున్న ‘స్పైడర్’ టీమ్

ఏ పెద్ద సినిమా బృందానికైనా త‌మ మూవీ విడుద‌ల‌కు ముందు పైర‌సీ భ‌యం ప‌ట్టుకుంటోంది. ఎన్నో కోట్లు ఖ‌ర్చుచేసి, ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన సినిమా పైర‌సీ పాలు అవుతుండ‌డంతో ఏం చేయాలో తోచ‌క ద‌ర్శ‌క, నిర్మాత‌లు త‌ల‌లు పట్టుకుంటున్నారు. ద‌య‌చేసి పైర‌సీ భూతాన్ని త‌రిమి కొట్టండి అంటూ ప్రేక్షకుల‌కు పిలుపునిస్తున్నారు. మ‌హేశ్ బాబు, మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న స్పైడ‌ర్ సినిమా మ‌రో రెండు రోజుల్లో విడుద‌ల కానున్న విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా త‌మ సినిమాను పైర‌సీ బారిన ప‌డ‌కుండా స‌హ‌క‌రించాల‌ని ఆ సినిమా యూనిట్ కోరుతోంది. స్పైడ‌ర్ సినిమాకు సంబంధించి ఇంట‌ర్నెట్‌లో ఏవైనా లింకులు క‌నిపిస్తే త‌మకు పంపించాల‌ని కోరుతోంది. spyderantipiracy@gmail.com కు స్పైడ‌ర్ పైర‌సీ లింకుల‌ను పంపిస్తే పైర‌సీ చేసే వారిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకునేలా చేస్తామ‌ని పేర్కొంది.

More Telugu News