gold saree: అమ్మవారి కోసం 22 కేజీల బంగారంతో చీర!

  • ప్ర‌ముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్ ఆధ్వర్యంలో తయారుచేసిన చీర
  • చీర కోసం శ్రమించిన 50 మంది నిపుణులు 
  • కోల్‌క‌తాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు

దుర్గామాత కోసం సుమారు 22 కేజీల బంగారంతో చీరను తయారు చేయించింది ఓ పూజా క‌మిటీ. శ‌ర‌న్న‌వ‌రాత్రుల సంద‌ర్భంగా దేశంలోని అన్ని ప్రాంతాల్లో భ‌క్తులు క‌న‌కదుర్గ విగ్ర‌హాల‌ను ప్ర‌తిష్టించిన విష‌యం తెలిసిందే. తొమ్మిది రోజులు తొమ్మిది ర‌కాల చీర‌లను క‌ట్టి చివ‌రి రోజు వాటిని వేలం వేసే సంప్ర‌దాయం కూడా ఎన్నో ప్రాంతాల్లో ఉంది. అయితే, కోల్‌క‌తాలోని సంతోష్‌ మిత్రా స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన మండపం, అమ్మవారి విగ్రహం వార్త‌ల్లో నిలిచాయి.

ఆ మండ‌పాన్ని లండన్‌ థీమ్‌తో త‌యారు చేశారు. ప్ర‌ముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ అగ్నిమిత్ర పౌల్ తో 22 కేజీల బంగారంతో చీరను డిజైన్ చేయించారు. ఈ చీరను త‌యారు చేయ‌డానికి సుమారు 50 మంది నిపుణులు శ్ర‌మించారు. ఈ చీర‌పై పక్షులు, సీతాకోక చిలుకలు, నెమళ్లు, ర‌క‌ర‌కాల పూల‌ బొమ్మలను ఎంబ్రాయిడరీ చేయించారు.

  • Loading...

More Telugu News