kareena kapoor: 'రంగస్థలం 1985'లో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్?

  • చాలావరకూ షూటింగ్ పూర్తి చేసుకున్న 'రంగస్థలం'
  •  మాస్ ను ఊపేసే స్పెషల్ సాంగ్
  •  కరీనా కపూర్ తో సంప్రదింపులు 
  •  త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ    

తాజాగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ షికారు చేసేస్తోంది. 'రంగస్థలం 1985' సినిమాలో కరీనా కపూర్ స్పెషల్ సాంగ్ చేసే అవకాశం ఉందనేది ఆ వార్త సారాంశం. ఈ సినిమా కోసం హైదరాబాద్ .. భూత్ బంగ్లా సమీపంలో 10 కోట్ల ఖర్చుతో ఒక విలేజ్ సెట్ వేశారు. కొంతకాలంగా అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

 గ్రామీణ నేపథ్యంలో సాగే కథ కనుక, మాంచి మాస్ మసాలాతో కూడిన ఒక స్పెషల్ సాంగ్ ను రెడీ చేశారట. ఈ సాంగ్ ను కరీనా కపూర్ తో గానీ, ప్రియాంక చోప్రాతో గాని చేయిస్తే కొత్తగా ఉంటుందని భావించారట. ఈ విషయంపై వాళ్లను సంప్రదించినట్టుగా కూడా చెప్పుకుంటున్నారు. కరీనా కపూర్ తో చేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ ప్రచారంలో వాస్తవమెంతో గానీ, ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారిపోయింది.        

More Telugu News