coal rifinery: ప్ర‌పంచంలో అతిపెద్ద‌ ఇంధ‌న శ‌క్తి కంపెనీల్లో మూడో స్థానం సాధించిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌

  • మొద‌టిస్థానంలో ర‌ష్యాకు చెందిన గాజ‌ర్‌పోమ్‌
  • టాప్ 10లో ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్‌
  • ప‌ద‌కొండో స్థానంలో ఓఎన్‌జీసీ

ప్ర‌పంచంలో అతిపెద్ద ఇంధ‌న శ‌క్తి ఉత్ప‌త్తి కంపెనీల్లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ర‌ష్యాకు చెందిన గాజ‌ర్‌పోమ్ సంస్థ మొద‌టిస్థానంలో నిల‌వ‌గా, జ‌ర్మ‌న్ కంపెనీ ఇయాన్ రెండో స్థానంలో నిలిచింది. టాప్ 250 గ్లోబ‌ల్ ఎన‌ర్జీ కంపెనీల ర్యాంకుల‌ను ఎస్ అండ్ పీ గ్లోబ‌ల్‌ ప్లాట్స్‌ సంస్థ విడుద‌ల చేసింది.

అలాగే భార‌త ప్ర‌భుత్వానికి చెందిన ఇండియ‌న్ ఆయిల్ కార్పోరేష‌న్ సంస్థ ఏడో స్థానానికి చేరుకుంది. గ‌తేడాది ఈ సంస్థ 14వ స్థానం ద‌క్కించుకుంది. ఆయిల్ అండ్ నేచుర‌ల్ గ్యాస్ కార్పోరేష‌న్ సంస్థ 11వ స్థానాన్ని ఆక్ర‌మించుకుంది. మొత్తం 250 కంపెనీల్లో భార‌త్‌కి చెందిన 14 ఇంధ‌న శ‌క్తి కంపెనీలు మాత్ర‌మే చోటు సంపాదించుకోగ‌లిగాయి. వీటిలో భార‌త్ పెట్రోలియం కార్పోరేష‌న్ లిమిటెడ్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పోరేష‌న్ లిమిటెడ్‌, ప‌వ‌ర్ గ్రిడ్ కార్పోరేష‌న్‌, గెయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలు వ‌రుసగా 39, 48, 81, 106 స్థానాల్లో నిలిచాయి.

  • Loading...

More Telugu News