ss rajamouli: మహాభారతం తీయడం లేదు: రాజమౌళి

  • 'మహాభారతం' సినిమా నా కల అని చెప్పాను
  • 'మహాభారతం' సినిమాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదు
  • ప్రస్తుతం 'బాహుబలి 2' సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాను
  • ప్రస్తుతానికి  ఏ సినిమా మొదలుపెట్టలేదు
  • త్వరలోనే నెక్ట్స్ ప్రాజెక్టు ప్రారంభిస్తాను

'మహాభారతం' సినిమాను తాను తీయడం లేదని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెలిపాడు. 'మహాభారతం' సినిమాను రాజమౌళి తీస్తాడని గతంలో ఆయన తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం తాను 'బాహుబలి 2' విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపారు. 'మహాభారతం' సినిమా తన కల అని చెప్పానే కానీ, తాను తీస్తున్నానని మాత్రం చెప్పలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతానికైతే తాను ఏ సినిమా మొదలు పెట్టలేదని ఆయన స్పష్టం చేశారు. కొంత కాలం తరువాత తన తరువాత ప్రాజెక్టు ప్రారంభిస్తానని ఆయన అన్నారు. 

More Telugu News