prakasam: ఎస్సైని కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించిన దోపిడీ దొంగలు!

  • టోల్ ప్లాజా వద్ద దోపిడీ దొంగల హల్ చల్
  • ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజా వద్ద ఘటన 
  • లారీ డ్రైవర్, క్లీనర్ ఫిర్యాదు
  • దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఎస్సై నాగమల్లేశ్వరరావు
  • ఎస్సైని కత్తులతో పొడిచి పరారైన దొంగలు
  • తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఎస్సై 
దోపిడీ దొంగలు ఎస్సైని కత్తులతో పొడిచి బీభత్సం సృష్టించిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా బొల్లాపల్లి టోల్ ప్లాజ్ సమీపంలో ఆ దారిలో వెళ్లే లారీలు, ట్రక్కులు, ఇతర వాహనాలను ఆపి, దోపిడీ దొంగలు దోచుకుంటున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో దోపిడీ దొంగలు అటకాయించారని, తమను రక్షించాలని పోలీసులకు లారీ డ్రైవర్, క్లీనర్ నుంచి ఫిర్యాదు వచ్చింది. దీంతో హుటాహుటీన బయల్దేరిన ఎస్సై సంఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులను చూసి పలాయనం చిత్తగించాల్సిన దోపిడీ దొంగలు వారిపై దాడికి దిగారు. ఎస్సైని కత్తులతో పొడిచారు. దీంతో ఎస్సైకి తీవ్రగాయాలయ్యాయి. సిబ్బంది ఆయనను హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. 
prakasam
thieves
si attacked

More Telugu News