poison: విషం తాగిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు.. తమిళనాడులో విషాద ఘటన!

  • కుటుంబం మొత్తం ఆత్మహత్యాయత్నం
  • ఐదుగురి మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
  • చికిత్సనందిస్తున్న వైద్యులు
  • విచారణ చేబట్టిన పోలీసులు

తమిళనాడులో ఒకే కుటుంబానికి చెందినవారంతా విషంతాగిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన ఘటన వివరాల్లోకి వెళ్తే... మధురైకి చెందిన కుటుంబ సభ్యులు 8 మంది విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా వాంతులు చేసుకుంటుండడంతో గుర్తించిన స్థానికులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారికి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఒకే కుటుంబానికి చెందిన అందరూ విషం తాగడంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. 

  • Loading...

More Telugu News