venkatesh: 'సుల్తాన్' రీమేక్ లో వెంకటేశ్ .. జోడీగా మళ్లీ 'గురు' నాయిక!

  •  రీమేక్స్  వైపు ఎక్కువగా మొగ్గుచూపే వెంకటేశ్
  •  హిందీ 'సుల్తాన్' రీమేక్ లో చేయాలనే నిర్ణయం
  •  కథానాయికగా రితికా సింగ్
  •  త్వరలోనే పూర్తి వివరాలు  

వైవిధ్యభరితమైన కథల కోసం కొంత కాలంగా వెంకటేశ్ వెయిట్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన దగ్గరికి వచ్చిన కథలు ఆయనకి అంతగా సంతృప్తిని కలిగించలేదట. దాంతో హిందీలో వచ్చిన 'సుల్తాన్' సినిమా తెలుగు రీమేక్ లో చేయాలనే నిర్ణయానికి వచ్చేశాడని అంటున్నారు. సల్మాన్ ఖాన్ - అనుష్క శర్మ జంటగా నటించిన ఈ సినిమా, క్రితం ఏడాది భారీ విజయాన్ని సాధించింది. సల్మాన్ ఖాన్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది.

దాంతో ఈ సినిమా చేయాలని వెంకటేశ్ డిసైడ్ అయ్యారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించడానికి రంగం సిద్ధమైపోయిందని అంటున్నారు. ఈ సినిమాలో కథానాయికగా రితికా సింగ్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గతంలో వెంకటేశ్ .. రితికా సింగ్ కాంబినేషన్లో వచ్చిన 'గురు' సినిమా సక్సెస్ ను సాధించిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

More Telugu News