Rajiv Gandhi International Airport: హైదరాబాద్ విమానాశ్రయానికి అరుదైన గుర్తింపు!

దేశంలో వీల్‌చైర్ లిఫ్ట్ (వెర్టి-లిఫ్ట్)‌ను ప్రవేశపెట్టిన తొలి విమానాశ్రయంగా హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం గుర్తింపు దక్కించుకుంది. యాక్సెస్‌బుల్ ఇండియా ప్రచారంలో భాగంగా ఈ లిఫ్ట్‌ను ప్రారంభించారు. వీల్‌చైర్ ప్రయాణికుల సమయాన్ని వీలైనంతగా తగ్గించే ఉద్దేశంతో ఈ వెర్టి-లిఫ్ట్‌ను ప్రారంభించారు.

ప్రయాణికులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని ప్రారంభించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ సదుపాయాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ సీఈవో ఎస్‌జీకే కిషోర్ తెలిపారు. వెర్టి-లిఫ్ట్‌ను ప్రారంభించిన తొలి విమానాశ్రయంగా గుర్తింపు లభించినందుకు ఆనందంగా ఉందన్నారు.

  • Loading...

More Telugu News