Hyderabad: నా పెళ్లాం నా ఇష్టం...నేను భారత చట్టప్రకారమే వివాహం చేసుకున్నాను: ఎదురు తిరిగిన అరబ్ షేక్

  • భారత చట్టప్రకారమే వివాహం చేసుకున్నానంటున్న అరబ్ షేక్
  • వివాహానికి 5 లక్షలు ఖర్చు చేశానని వెల్లడి 
  • భారత్ కు పంపేది లేదని చెబుతున్న అరబ్ షేక్
  • ఎంబసీని సంప్రదించిన పోలీసు అధికారులు
  • బాలికను తీసుకొస్తామని కుటుంబ సభ్యులకు హామీ

 పాతబస్తీకి చెందిన బాలిక (16)ను వివాహం చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన అరబ్‌ షేక్‌ ఎదురుతిరిగాడు. "నా పెళ్లాం నాఇష్టం...నేను భారత్ చట్టాల ప్రకారమే వివాహం చేసుకున్నాను...వివాహానికి 5 లక్షల రూపాయలు ఖర్చు చేశాను...భారత్ కు పంపేది లేద"ని మొండికేస్తున్న ఘటన ఒమన్ లో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... గత ఆగస్టులో పాతబస్తీలోని ఫలక్ నుమా ప్రాంతానికి చెందిన బాలిక(16)ను ఒమన్‌ దేశానికి చెందిన అహ్మద్‌ అబ్దుల్లా అముర్‌ అలీ రహ్బీ వివాహం చేసుకుని, నకిలీ పత్రాలతో తమ దేశానికి తీసుకెళ్లాడు.

 దీనిపై బాలిక తల్లిదండ్రులు ఆగస్టు 17న ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాంట్రాక్టు పెళ్లిళ్లకు సహకరిస్తున్న ఏజెంట్లు, బ్రోకర్లతో సహా 20 మందిని అరెస్టు చేశారు. అలాగే ఒమన్ ఎంబసీ అధికారులతో మాట్లాడారు. అరబ్ షేక్ దుర్మార్గాన్ని ఎంబసీ అధికారులకు వివరించారు. దీంతో అరబ్ షేక్ ఎదురు తిరిగాడు. తాను ఖర్చు చేసిన డబ్బు తనకు తిరిగి ఇస్తే ఆమెను భారత్ కు పంపిస్తానని చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బాలికను భారత్ కు తీసుకొస్తామని అధికారులు ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. 

More Telugu News