america: ట్రంప్-కిమ్ గొడవ కిండర్ గార్టెన్ పిల్లల గొడవలా ఉంది!: రష్యా

  • కిమ్-ట్రంప్ నర్సరీ పిల్లల్లా గొడవలాడుకుంటున్నారు
  • ఉత్తరకొరియాపై అమెరికా దాడి చేయలేదు
  • ఉత్తర కొరియా వద్ద అణుబాంబులున్నాయన్న సంగతి అమెరికాకు తెలుసు
  • సమస్యను సామరస్యంగా పరీక్షించుకోవాలి
  • అమెరికా బాంబు దాడులకు దిగితే నష్టపోయేది ఉత్తరకొరియా మాత్రమే కాదు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్ ఉన్ లపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు దేశాల అధ్యక్షుల గొడవ నర్సరీ పిల్లల పోరాటంలా ఉందని రష్యా వ్యాఖ్యానించింది. ఒక టీవీ ఛానెల్ తో రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ మాట్లాడుతూ, ప్యాంగ్యాంగ్‌ (ఉత్తర కొరియా) పై అమెరికా దాడి చేయలేదని అన్నారు. దానికి కారణం ఏంటంటే ఉత్తర కొరియా దగ్గర అణుబాంబులు ఉన్నాయనే విషయం అమెరికాకు తెలుసని చెప్పారు.

తాను ఉత్తరకొరియాకు మద్దతివ్వడం లేదని చెప్పిన ఆయన, వాస్తవం మాట్లాడుతున్నానని తెలిపారు. ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. అలాకాకుండా ఈ రెండు దేశాలు బాంబు దాడులకు దిగితే కేవలం ఆయా దేశాలే కాకుండా దక్షిణకొరియా, జపాన్‌, రష్యా, చైనా దేశాల్లోని ఎంతో మంది అమాయక ప్రజలు సమస్యలు ఎదుర్కొంటారని ఆయన తెలిపారు. ఈ రెండుదేశాల అధ్యక్షులు కిండర్ గార్టెన్ పిల్లల్లా పడుతున్న గొడవను మానేయాలని ఆయన సూచించారు. 

More Telugu News