TTD: చంద్రబాబు సమక్షంలో టీటీడీ అర్చకుల గొడవ! వీడియో చూడండి

  • పరివట్టం కట్టే వేళ ప్రధానార్చకుల మధ్య విభేదాలు
  • పోటీ పడిన వేణుగోపాల్, రమణ దీక్షితులు
  • వైరల్ అవుతున్న వీడియో

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సీఎం చంద్రబాబునాయుడు వెళ్లిన వేళ, ఆలయ ప్రధానార్చకుల మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ముందు, తలకు పరివట్టం కట్టేవేళ జరిగిన ఘటన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. వేది ఆంజనేయస్వామి ఆలయానికి చంద్రబాబు వచ్చి, అఖిలాండం వద్ద ఏర్పాటు చేసిన స్థానంలో కూర్చోగా, ప్రధాన అర్చకుడు వేణుగోపాల్ దీక్షితులు, పరివట్టం వస్త్రాన్ని విప్పి, చంద్రబాబుకు కట్టేందుకు ముందుకు వచ్చారు.

అదే సమయంలో అక్కడే ఉన్న మరో ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, తాను కడతానని చెబుతూ, దాన్ని బలవంతంగా పట్టుకున్నారు. ఇద్దరి చేతుల మధ్యా పరివట్టం కొంతసేపు ఉండిపోగా, రమణ దీక్షితులు గట్టిగా వస్త్రాన్ని పట్టుకోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఆపై ఓ అధికారి వచ్చి వేణుగోపాల్ ను పక్కకు జరగాలని చెప్పడం, ఆపై ఆయన పక్కకెళ్లిపోవడం ఈ వీడియోలో తెలుస్తోంది. అనంతరం డాలర్ శేషాద్రి, రమణ దీక్షితులు కలిసి చంద్రబాబుకు పరివట్టం కట్టారు.

  • Loading...

More Telugu News