sangeeta varshini: ముస్లిం యువకుడితో కనిపించిందని యువతిని కొట్టిన బీజేపీ మహిళా నేత!

  • టీ స్టాల్ వద్ద కనిపించిన యువతి
  • ఎవరో తెలుసుకోకుండా ప్రేమేంటని ప్రశ్నించిన సంగీత వర్షిణి
  • తిడుతూ చెయ్యి చేసుకున్న బీజేపీ నేత
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ ముస్లిం యువకుడితో కలసి టీ స్టాల్ వద్ద కనిపించిన యువతిని కొట్టిన ఘటనలో బీజేపీ మహిళా విభాగం నేత సంగీత వర్షిణిపై యూపీ, అలీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టిన పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఓ టీ స్టాల్ వద్ద బాధితురాలు ముస్లిం యువకుడితో కలసి కూర్చుంది.

అదే సమయంలో అటుగా వెళుతున్న సంగీత వర్షిణి ఆమెను చూసి ఆగ్రహానికి గురై, హిందువా? ముస్లిమా? ఎవరో తెలుసుకోకుండా ప్రేమిస్తావా? అని తిడుతూ చెయ్యి చేసుకుంది. తాను మర్యాదగా చెప్పినా వినలేదంటూ గద్దించింది. ఈ ఘటన మొత్తాన్ని అటుగా వెళుతున్న ఓ వ్యక్తి తన మొబైల్ లో చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయగా, అది వైరల్ అయింది. మహిళా హక్కుల పరిరక్షణా సంఘాలు రంగంలోకి దిగి, వర్షిణిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
sangeeta varshini
hindu
muslim
uttar pradesh

More Telugu News