rahane: ఉంటానో, పోతానో తెలియట్లేదు... సచిన్ ఎలాంటి షాట్లూ నేర్పించలేదు: అజింక్య రహానే

  • ఆటను ఆస్వాదించడమే లక్ష్యం
  • బ్యాటింగ్ ఆర్డర్ లో పోటీ పెరిగింది
  • ధావన్ వస్తే నేను డౌటే
  • సచిన్ సలహాలు మాత్రమే ఇచ్చారన్న రహానే

ఆడే అవకాశం వచ్చినప్పుడెల్లా, ఆటను ఆస్వాదిస్తూ, బాగా ఆడాలన్నదే తన లక్ష్యమని, బ్యాటింగ్ ఆర్డర్ లో పోటీ పెరిగిన కారణంగానే తాను వచ్చి పోవాల్సి వస్తోందని అజింక్య రహానే వ్యాఖ్యానించాడు. నేడు మూడో వన్డే కోసం జరిగిన ప్రాక్టీస్ తరువాత రహానే మీడియాతో మాట్లాడుతూ, తన భవిష్యత్తు ఎలా ఉంటుందన్న విషయమై ఎక్కువగా ఆలోచించడం లేదని అన్నాడు.

ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులోకి వస్తే, తన స్థానం ఉంటుందో, ఉండదోనన్న సందేహం తనకుందని అన్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తనకు షాట్లు ఎలా ఆడాలో చెప్పలేదని, కేవలం మైండ్ సెట్ బాగుంటే సులువుగా ఆడవచ్చని సలహా ఇచ్చారని చెప్పాడు. ఒత్తిడికి లోను కావద్దని, పరిస్థితికి తగ్గట్టుగా ఆడితే సరిపోతుందని చెప్పారని అన్నాడు. జట్టుకు అవసరమైన వేళ ఓ 70 పరుగులు చేస్తే చాలని భావిస్తుంటానని, తొలి ఐదు స్థానాల్లో తానుండటం ప్లస్ పాయింట్ అని పేర్కొన్నాడు.

More Telugu News