kancha ilaiah: అక్టోబర్ 4 వరకూ మౌనదీక్ష... ఒక్కమాట అనను, ఇల్లు కదలను: కంచె ఐలయ్య

  • వైశ్యులపై పుస్తకం రాసి వివాదంలో చిక్కుకున్న ఐలయ్య
  • 12 రోజుల పాటు మౌనదీక్ష, స్వీయ గృహ నిర్బంధం
  • నిన్న పరకాలలో ఐలయ్యను అడ్డుకున్న వైశ్య సంఘాలు

వైశ్యులపై తాను రాసిన 'సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు' పుస్తకంతో వివాదంలో కూరుకుపోయిన ప్రొఫెసర్ కంచె ఐలయ్య, కీలక నిర్ణయం తీసుకున్నారు. నిన్న ఆయన పరకాల ప్రాంతానికి వెళ్లినప్పుడు వైశ్య సంఘాలు అడ్డుకుని తమ నిరసన తెలిపిన నేపథ్యంలో ఐలయ్య స్పందించారు.

వచ్చే నెల 5వ తేదీన యూనివర్శిటీ ప్రొఫెసర్లతో తన పుస్తకంపై చర్చకు సిద్ధమని పేర్కొన్న ఆయన, నాలుగో తేదీ వరకూ మౌనవ్రతం పాటిస్తున్నట్టు చెప్పారు. అప్పటివరకూ తాను స్వీయ గృహ నిర్బంధంలో ఉంటానని, ఇల్లు కదలబోనని ఓ టీవీ చానల్ కు తెలిపారు. ఈ పన్నెండు రోజుల పాటు తాను ఒక్క మాట కూడా మాట్లాడబోనని, ఇల్లు కదిలేది లేదని, అనంతరం 5వ తేదీన బయటకు వస్తానని అన్నారు.

More Telugu News