mahesh babu: బలమైన ఎమోషన్స్ తో కూడిన స్టైలీష్ మూవీ 'స్పైడర్' : మహేశ్

  • 'స్పైడర్' ప్రమోషన్స్ లో బిజీగా మహేశ్
  •  ఈ సినిమా ఓ అందమైన జ్ఞాపకం
  •  అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే కంటెంట్
  •  అభిమానులకు సంతృప్తినిస్తుంది    

'స్పైడర్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, మహేశ్ అభిమానుల్లో అంతకంతకూ ఆసక్తి పెరిగిపోతోంది. ఇక మహేశ్ బాబు కూడా ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో నటించడం ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని అన్నాడు.

 మురుగదాస్ సినిమాలు రెండు రకాలుగా ఉంటాయనీ, 'రమణ' .. 'కత్తి' వంటి ఎమోషన్స్ తో కూడిన సినిమాలు ఒక రకమని చెప్పాడు. ఇక స్టైలీష్ గా వుండే 'గజని' .. ' తుపాకి' వంటి సినిమాలు రెండో రకమని అన్నాడు. 'స్పైడర్' వచ్చేసి రెండవ రకానికి చెందినదనీ .. దీనికి మురుగదాస్ తనదైన శైలిలో ఎమోషన్స్ ను కూడా జోడించాడని మహేశ్ చెప్పాడు. కనుక ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను .. మాస్ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుందని అన్నాడు. తన అభిమానులు అన్ని విధాలా సంతృప్తిని వ్యక్తం చేసే సినిమా ఇదని చెప్పుకొచ్చాడు.     

More Telugu News