actor: వచ్చే ఏడాది రాజకీయాల్లోకి.. స్పష్టం చేసిన సినీ నటుడు సుమన్

  • ప్రజా సమస్యలపై నాయకుల నిర్లక్ష్యం
  • ఏ పార్టీలో చేరేదీ తర్వాత చెబుతా
  • సేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి
తాను రాజకీయాల్లోకి రావడం తథ్యమని ఇది వరకే ప్రకటించిన సీనియర్ నటుడు సుమన్ ఈ విషయంలో ఇప్పుడు మరింత స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాదే తన రాజకీయ రంగ ప్రవేశం ఉంటుందని తెలిపారు. అయితే పార్టీ ఏదనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. రాజకీయాల్లో ఉన్న చాలా మంది  ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు.

ప్రజా సమస్యలపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుతున్నారన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నట్టు సుమన్ వివరించారు. ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని ఇంకా నిర్ణయించుకోలేదని, అయితే త్వరలోనే ఆ విషయాన్ని ప్రకటిస్తానని సుమన్ తెలిపారు.
actor
tollywood
suman
politics

More Telugu News