china: భారత్ పట్ల తీరు మార్చుకుంటోన్న చైనా!

  • భారత్, చైనా కలిసి పని చేస్తున్నాయి: చైనా కాన్సుల్ జనరల్ మా ఝన్వు
  • స‌త్సంబంధాలు బలపడేందుకు మోదీ, జిన్ పింగ్ చర్చించారు
  • డోక్లాం ప్రతిష్టంభన అంశాన్ని వదిలేశాం
  • భద్రతా సిబ్బంది మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు మరింత కృషి

ఎల్లప్పుడూ భారత్ ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే చైనా వైఖరిలో మార్పువచ్చింది. భారత్, చైనా కలిసి పని చేస్తున్నాయని భారత్ లో చైనా కాన్సుల్ జనరల్ మా ఝన్వు వ్యాఖ్యానించారు. ఇరు దేశాల మ‌ధ్య స‌త్సంబంధాలు మ‌రింత మెరుగుప‌ర్చుకునేందుకు అనుసరించవలసిన విధానాలపై భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, త‌మ దేశ‌ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ నెల 5న చర్చలు జరిపారని అన్నారు. క‌లిసి పని చేస్తే ఇరు దేశాలు మ‌రింత‌ అభివృద్ధి చెందుతాయ‌ని చెప్పారు. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా కోల్‌కతాలో ఝన్వు మాట్లాడుతూ ఇలా వ్యాఖ్యానించారు.

డోక్లామ్ ప్రతిష్టంభన అంశాన్ని ఇరు దేశాలు ఇప్పుడు పట్టించుకోవడం లేదా? అని విలేకరులు అడగగా.. తాము ఇక ఆ అంశాన్ని వదిలేశామ‌ని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపైనే దృష్టి పెట్టామ‌ని చెప్పారు. ఇరు దేశాల భద్రతా సిబ్బంది మధ్య సహకారాన్ని పెంపొందించుకునేందుకు మరింత కృషి చేయాలని మోదీ, జిన్ పింగ్ అంగీకారానికి వచ్చారని తెలిపారు. దీంతో భార‌త్‌తో క‌న‌బ‌రుస్తోన్న‌ చైనా తీరులో మార్పు వ‌చ్చింద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

More Telugu News