vijay: 'మెర్సెల్'కి ఊహించని దెబ్బే తగిలేసింది!

  • దూసుకుపోతోన్న 'మెర్సెల్' టీజర్
  •  అంతలోనే అనూహ్యంగా ఎదురు దెబ్బ
  •  టైటిల్ తనదంటూ ఒక వ్యక్తి ఫిర్యాదు
  •  అక్టోబర్ 3 వరకూ ప్రమోషన్స్ ఆపేయమన్న చెన్నై కోర్టు

విజయ్ అభిమానులంతా 'మెర్సెల్' సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఆయన ఈ సినిమాలో రాజకీయనాయకుడిగా .. మెజీషియన్ గా .. డాక్టర్ గా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 18వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది.

 అయితే ఈ టైటిల్ ను తాను 2014లోనే రిజిస్టర్ చేయించాననీ, నిబంధనలకు విరుద్ధంగా తన టైటిల్ ను వాడేస్తున్నారని పిటీషన్ దారు చెన్నై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కోర్టు .. ఈ సినిమా ప్రమోషన్స్ ని అక్టోబర్ 3వ తేదీ వరకూ నిలిపివేయమంటూ తాత్కాలిక నిషేధాన్ని విధించింది. దాంతో 10 రోజుల పాటు ఈ సినిమా ప్రమోషన్స్ ను నిలిపివేయవలసిన పరిస్థితి వచ్చింది. ఒక రకంగా ఇది 'మెర్సెల్' కి గట్టి దెబ్బేనని చెప్పాలి.   

More Telugu News