Senior Journalist KJ Singh: పంజాబ్‌లో సీనియర్ జర్నలిస్టుతో పాటు ఆయన తల్లిని హత్య చేసిన దుండగులు!

  • ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్ కేజే సింగ్‌, ఆయ‌న త‌ల్లి గురుచ‌ర‌ణ్ కౌర్ దారుణ హత్య 
  • వారి హత్యను ఖండించిన శిరోమణి అకాలీదళ్ అధ్య‌క్షుడు
పంజాబ్‌లోని మొహాలీలో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్టు కేజే సింగ్‌తో పాటు ఆయ‌న త‌ల్లి గురుచ‌ర‌ణ్ కౌర్ (92) అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు. వారిని ఎవ‌రో గుర్తు తెలియ‌ని దుండ‌గులు హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేజే సింగ్‌ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో పని చేశారు. వారి మృతిపై శిరోమణి అకాలీదళ్ అధ్య‌క్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాద‌ల్ స్పందిస్తూ... ‘కేజే సింగ్, ఆమె త‌ల్లి హ‌త్య‌ను ఖండిస్తున్నాను. ఈ ఘ‌ట‌నకు పాల్ప‌డ్డ‌ నిందితుల‌ను పోలీసులు త్వ‌ర‌గా ప‌ట్టుకుంటార‌ని భావిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
Senior Journalist KJ Singh
Mother Found Dead

More Telugu News