raviteja: 'రాజా ది గ్రేట్'కి రీ షూట్ తప్పడం లేదా?

  •  పాటల చిత్రీకరణలో 'రాజా ది గ్రేట్'
  •  సెకండాఫ్ లో కొన్ని సీన్స్ పట్ల దిల్ రాజు అసంతృప్తి
  •  రీ షూట్ చేయడమే బెటర్ అనే ఆలోచన
  •  అక్టోబర్లో రిలీజ్ కాకపోవచ్చనే టాక్    

అనిల్ రావిపూడి దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా 'రాజా ది గ్రేట్' తెరకెక్కుతోంది. మెహ్రీన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ప్రస్తుతం కేరళలో పాటల చిత్రీకరణ జరుపుకుంటోంది. అక్టోబర్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆ రోజున ఈ సినిమా విడుదల సందేహమేననే టాక్ వినిపిస్తోంది.

 ఈ సినిమా సెకండాఫ్ చూసిన నిర్మాత దిల్ రాజు, కొన్ని కీలకమైన సీన్స్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశారట. అవి మరింత సహజంగా వుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడని అంటున్నారు. ఆ సీన్స్ వరకూ రీ షూట్ చేయడమే బెటర్ అని ఆయన అనడంతో, ఆ దిశగా ప్రయత్నాలు మొదలైనట్టు చెబుతున్నారు. ఈ కారణంగా ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.    

More Telugu News