rafael nadal: ర‌ఫెల్ నాద‌ల్‌ను ప‌రిచ‌యం చేసిన రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌... వీడియో చూడండి

టెన్నిస్ లెజెండ్స్ ర‌ఫెల్ నాద‌ల్‌, రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌లు పోరాడుతున్నారంటే టెన్నిస్ అభిమానుల‌కు పెద్ద పండ‌గే. గ‌త 13 ఏళ్ల‌లో వారిద్ద‌రూ 37 సార్లు పోటీ ప‌డి ఉంటారు. మ్యాచుల్లో హోరాహోరీగా త‌ల‌ప‌డినా ఇంట‌ర్వ్యూల్లో, బ‌య‌ట ఒక‌రినొక‌రు బాగా పొగిడేసుకుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం లావ‌ర్ క‌ప్‌లో ఒకే జ‌ట్టు త‌ర‌ఫున వీరిద్ద‌రూ పోరాడుతున్నారు. మొద‌టి మ్యాచ్ త‌ర్వాత‌ లావ‌ర్ క‌ప్ నిర్వాహ‌కులు ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఫెద‌ర‌ర్‌, ర‌ఫెల్ పాల్గొన్నారు. ఇందులో ర‌ఫెల్ నాద‌ల్‌ను వేదిక మీద‌కి ఆహ్వానించే బాధ్య‌త‌ను రోజ‌ర్ ఫెద‌ర‌ర్ తీసుకున్నాడు. ఈ కార్య‌క్ర‌మ వీడియో లావ‌ర్ క‌ప్ అధికారిక ట్విట్ట‌ర్ అకౌంట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఫెద‌ర‌ర్ త‌న గురించి వివ‌రిస్తున్న‌పుడు ర‌ఫెల్ చిన్న‌పిల్లాడిలా సిగ్గు ప‌డుతుండ‌టం ఈ వీడియోలో చూడొచ్చు.
rafael nadal
roger federer
introduction party
laver cup
video
twitter

More Telugu News