spaider: అసెంబ్లీ సెట్లో పోసాని...'భరత్ అను నేను' చిత్రీకరణలో బిజీ!

  • హైదరాబాదు శివార్లలో అసెంబ్లీ సెట్
  • 'భరత్ అను నేను' సినిమా కోసం సెట్
  • అసెంబ్లీ సెట్ లో సందడి చేసిన పోసాని, బెనర్జీ, జీవా
  • 'స్పైడర్' ప్రమోషన్ లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చిత్రీకరణలో మహేష్ బాబు

హైదరాబాదు శివార్లలో 'భరత్ అను నేను' సినిమా కోసం వేసిన అసెంబ్లీ సెట్ లో పోసాని కృష్ణమురళి సందడి చేశారు. ఈ సినిమాలో తనది 'ఎమ్మెల్యే' పాత్ర అన్నారు కానీ, ఇంతకీ ప్రతిపక్ష ఎమ్మెల్యేనా? లేక అధికార పక్ష ఎమ్మెల్యేనా? అన్న విషయాన్ని డైరెక్టర్ ఇంకా చెప్పలేదని పోసాని ఈ సందర్భంగా తెలిపారు.

 పోసాని వున్న ఈ సినిమాలోని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఫోటోలో బెనర్జీ, జీవా కూడా వున్నారు. 'స్పైడర్' సినిమా విడుదల సందర్భంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు మరోపక్క, ఈ సినిమా చిత్రీకరణలో కూడా పాల్గొంటుండడం విశేషం. 

More Telugu News