mosquitos: దోమలను సమూలంగా నాశనం చేయాలని కోరుతూ పిటిషన్.. తమ వల్ల కాదన్న సుప్రీంకోర్టు!

  • ప్రభుత్వాలకు ఆదేశాలు జారీచేయాల‌ని కోరిన వైనం
  • అలా చేయ‌లేమ‌న్న సుప్రీం ధ‌ర్మాసనం
  • దోమ‌ల్ని నాశ‌నం చేయ‌డం దేవుడికి మాత్రమే సాధ్యమని వ్యాఖ్య 

కొన్నిసార్లు అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టుకి తీర్పు చెప్పడానికి సాధ్య‌ప‌డ‌ని వింత పిటిష‌న్లు వ‌స్తుంటాయి. ఇటీవ‌ల అలాంటి పిటిష‌న్ ఒక‌దాన్ని జ‌స్టిస్ మ‌ద‌న్ బి లోకూర్‌, జ‌స్టిస్‌ దీప‌క్ గుప్త ధ‌ర్మాస‌నం విచారించింది. దోమ‌ల‌ను స‌మూలంగా అంతం చేయాల‌నేది ఆ పిటిష‌న్ సారాంశం. డెంగ్యూ, చికున్ గున్యా, జికా వంటి వ్యాధులు వ్యాపింప‌జేసి ఎంతో మంది మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్న దోమ‌ల‌ను పూర్తిగా నాశనం చేసేలా చ‌ర్య‌లు తీసుకోమ‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు ఆదేశాలు జారీచేయాల‌ని కోరుతూ ధ‌నేష్ లెశ్ధాన్ అనే వ్య‌క్తి పిటిష‌న్ వేశాడు. అయితే అలా చేయ‌డం త‌మ ప‌రిధిలోకి రాద‌ని, ఈ ప‌ని కేవ‌లం దేవుడు మాత్ర‌మే చేయ‌గ‌ల‌డ‌ని ధ‌ర్మాస‌నం తీర్పునిచ్చింది. తాము దేవుళ్లం కాద‌ని, ఇలాంటి ప‌నులు చేయాల‌ని మ‌రోసారి అడ‌గొద్ద‌ని సుప్రీం కోర్టు సూచించింది.

More Telugu News