iran: క్షిపణి పరీక్ష నిర్వహించిన ఇరాన్... అమెరికా హెచ్చరికలు బేఖాతరు!

  • క్షిపణి పరీక్షలు నిర్వహించవద్దని హెచ్చరించిన అమెరికా
  • మధ్యంతర శ్రేణి క్షిపణి పరీక్షించిన ఇరాన్
  • ప్రయోగానికి సంబంధించిన దృశ్యాల ప్రత్యక్ష ప్రసారం
  • ప్రయోగానికి సంబంధించిన వివరాలు వెల్లడించని ఇరాన్

అమెరికా చేసిన హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోలేదు. మధ్యంతర శ్రేణి క్షిపణిని ఇరాన్ ప్రయోగించింది. ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించిన దృశ్యాలను అక్కడి అధికారిక టీవీలో ప్రసారం చేశారు. అయితే ఈ ప్రయోగం ఎక్కడి నుంచి ఎక్కడికి చేశారు?, ఎప్పుడు చేశారు? వంటి వివరాలేవీ ప్రకటించలేదు. కేవలం క్షిపణి ప్రయోగం నిర్వహించినట్టు, అది విజయవంతమైనట్టు ఇరాన్ ప్రకటించింది. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్ క్షిపణి పరీక్షలపై అమెరికా హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. 

More Telugu News