nagarjuna: బిగ్ బాస్ షోలో మెరవనున్న నాగార్జున?

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను గత కొన్ని వారాలుగా అలరిస్తున్న బిగ్ బాస్ షో ముగింపు దశకు వచ్చేసింది. ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఈ రియాల్టీ షో రేపటితో ముగుస్తోంది. రేపు జరగనున్న బిగ్ బాస్ సీజన్-1 గ్రాండ్ ఫినాలేకు టాలీవుడ్ స్టార్ నాగార్జున ముఖ్య అతిథిగా రాబోతున్నారని వార్త. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం, స్టార్ మా యాజమాన్యంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే బిగ్ బాస్ కు నాగార్జున వస్తున్నారంటూ ఫిల్మ్ నగర్ టాక్. మరి, ఈ షోకు నాగార్జున వస్తున్నారా? లేదా? తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే. 

More Telugu News