domain name: రోజురోజుకీ పెరుగుతున్న డొమైన్ రిజిస్ట్రేష‌న్లు... 331 మిలియ‌న్ల‌కు చేరుకున్న డొమైన్లు

  • డాట్ కామ్‌, డాట్ నెట్‌ల‌కే ప్ర‌థ‌మ ప్రాధాన్యం
  • సంవ‌త్స‌రానికి 2.1 శాతం పెరుగుతున్న రిజిస్ట్రేష‌న్లు
  • డొమైన్ కేటాయింపు కంపెనీ వెరిసైన్ నివేదిక‌లో వెల్ల‌డి

ఇంట‌ర్నెట్‌లో వెబ్‌సైట్ నిర్వ‌హించాలంటే ముందు డొమైన్ రిజిస్ట్రేష‌న్ చేయించుకోవాలి. ఇంట‌ర్నెట్ ఆధారిత సేవ‌లు నిత్య‌జీవితంలో భాగం అవుతుండ‌టంతో ఈ డొమైన్ రిజిస్ట్రేష‌న్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంద‌ని డొమైన్ కేటాయింపు, ఇంట‌ర్నెట్ సెక్యూరిటీ సంస్థ వెరిసైన్ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింది. 2017 రెండో త్రైమాసికం నాటికి అంత‌ర్జాతీయంగా ఈ డొమైన్ రిజిస్ట్రేష‌న్ల మొత్తం సంఖ్య 331.9 మిలియ‌న్ల‌కు చేరుకుందని నివేదిక బ‌య‌ట‌పెట్టింది.

సంవ‌త్స‌రానికి 2.1 శాతం చొప్పున డొమైన్ రిజిస్ట్రేష‌న్లు పెరుగుతున్న‌ట్లు కంపెనీ పేర్కొంది. వీటిలో ముఖ్యంగా డాట్ కామ్‌, డాట్ నెట్ డొమైన్ల‌కే ఎక్కువ మంది ప్రాధాన్యం ఇస్తున్నార‌ని తెలిపింది. జూన్ 30, 2017 నాటికి డాట్ కామ్‌, డాట్ నెట్ డొమైన్ల రిజిస్ట్రేష‌న్లు 144.3 మిలియ‌న్లు ఉన్న‌ట్లు వెరిసైన్ పేర్కొంది. ఇందులో డాట్ కామ్ డొమైన్ రిజిస్ట్రేష‌న్లు 129.2 మిలియ‌న్లు కాగా, డాట్ నెట్ రిజిస్ట్రేష‌న్లు 15.1 మిలియ‌న్లు ఉన్న‌ట్లు తెలిపింది.

More Telugu News