ntr: 'బిగ్ బాస్' ఫైనల్ ఎపిసోడ్ ను ఒక రేంజ్ లో ప్లాన్ చేశారట!

  •  అశేష ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న 'బిగ్ బాస్' 
  •  ఈ ఆదివారమే ఫైనల్ ఎపిసోడ్
  •  అందరిలోనూ పెరుగుతోన్న ఆసక్తి
  •  నాలుగు గంటల పాటు ఎన్టీఆర్ కార్యక్రమం 

'స్టార్ మా' చానల్లో ప్రసారమవుతోన్న 'బిగ్ బాస్' కార్యక్రమం మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తోంది. ఈ కార్యక్రమం ఒక్కసారిగా చానల్ రేటింగ్ ను పెంచేసి తన సత్తా చాటుకుంది. ముఖ్యంగా హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తోన్న ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

 ప్రతి శని .. ఆది వారాల్లో సందడి చేస్తోన్న ఎన్టీఆర్, చివరి వారంలో మరింత సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఆదివారం ప్రసారమయ్యే చివరి ఎపిసోడ్ ను మరింత ఆసక్తికరంగా .. ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు సమాచారం. ఆ రోజున ఎన్టీఆర్ ఏకధాటిగా కార్యక్రమాన్ని నాలుగు గంటల పాటు నడిపిస్తారని అంటున్నారు. ఇంతకు ముందు బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్లిన వాళ్లందరినీ ఈ ఫైనల్ ఎపిసోడ్ కి పిలిపిస్తున్నారట. వాళ్లందరి సమక్షంలో .. వాళ్ల ఫీలింగ్స్ నడుమ .. ఎన్టీఆర్ విశ్లేషణతో ఈ ఎపిసోడ్ ను అద్భుతంగా నడిపించనున్నట్టు తెలుస్తోంది.         

ntr

More Telugu News